తెలుగు

విశాల ఐక్య సంఘటన కావాలి!

telangana_1.jpg
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలనే డిమాండుతో ప్రజా గాయకుడు గద్దర్‌ వరంగల్‌, హనుమకొండ, కాజీపేటలలో డిసెంబర్‌ 11 నుంచి 15 వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో ఆ మూడు పట్టణాల్లో ప్రతి గడప తొక్కి ప్రతి ఇంటిలో పౌరుల కడుపులో తలపెట్టి తన ఈ డిమాండుకు సంఘీభావం ప్రకటించాలని కోరారు. ఈ విషయాన్ని పాదయాత్ర ప్రారంభించడానికి ముందుగానే రాజధాని నగరంలో, వరంగల్‌లో, పలుచోట్ల చెప్పాడు. మీడియాలో విస్త­ృత ప్రచారాన్ని పొందింది. గద్దర్‌ వరంగల్‌ నగరంలో కాలు మోపితే చంపేస్తామని, ఆయన పాదం మోపే నేలకింద మందుపాతరలు పెట్టి పేల్చివేస్తామని బ్లూ టైగర్స్‌ పేరుతో ఒక మీడియా ప్రకటన వచ్చింది.

Continue Reading »

సృజనాత్మక ఆయుధం

V.P Singh
లోక్‌సభలో 1990 సెప్టెంబర్‌ 6న మండల్‌ కమిషన్‌ నివేదికపై జరిగిన చర్చకు ప్రధాని వి.పి.సింగ్‌ ఇచ్చిన సమాధానంలోని కొన్ని భాగాలివి.

అణగారిన లేదా వెనుకబడిన కులాల్లో పుట్టిన ఒక వ్యక్తి జీవిత పర్యంతం అనేక అవమానాలను ఎదుర్కోవలసివుంది. చితిపై ఒక వ్యక్తి ఒక్కసారే కాలిపోతాడు; అయితే అణగారిన కులాల్లో పుట్టిన వ్యక్తులు తమ జీవితాంతం అడుగడుగునా అవమానాల పాలవుతారు. Continue Reading »

భాషా సాహిత్య సేవ - ఉద్దేశాలు

నిరసనలను, బయట ప్రదర్శనలను ఉత్సవాల్లో పాల్గొన్న కొందరు వక్తలు తప్పు పట్టినట్లుగా, అసహనం ప్రదర్శించి నట్లుగా చదివినప్పుడు, ఆ వక్తలు విప్లవ సాహిత్యాభిమానులు అని కూడ తెలిసినపుడు కాలం ఎంత మారింది అనిపించింది.

ఇప్పుడున్న భాషా సాహిత్య వాతావరణంలో 1970, 80ల తొలి రోజులను తలచుకుందాం. 1963-65 మధ్యకాలంలో ‘నవత’ వంటి ఉత్తమ కవిత్వ పత్రిక నిర్వహించిన ‘నక్షత్ర సప్తకం’ 70 జూలై 3,4 తేదీల్లో హైదరాబాదులో ‘అభ్యుదయ సాహిత్య వేదిక’ పేరుతో రెండు రోజుల సదస్సు నిర్వహించి ఆహ్వానిస్తే దిగంబర కవులు, తిరుగబడు కవులు, కె.వి.రమణారెడ్డి నిరాకరించారు. ‘అభ్యుదయ సాహిత్య వేదిక’ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మొదట మొహమాటపడిన శ్రీశ్రీ హైదరాబాదు దాకా వచ్చి అందులో పాల్గొనలేదు.
Continue Reading »

స్థానికత-సార్వజనీనత

స్థానికత-సార్వజనీనత  - వరవరరావుతిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు కరీంనగర్‌ విశ్వవిద్యాలయం శ్రీరాజరాజేశ్వరీ విశ్వ విద్యాలయం ఎందుకుకాకూడదు? సమ్మక్క సారలక్క విశ్వవిద్యాలయం ఎందుకు కాకూడదు?

కరీంనగర్‌లో 1985 నుంచి శాతవాహన స్నాతకోత్తర కళాశాలగా పనిచేస్తున్న ఉన్నత విద్యా సంస్థ, జిల్లాకో విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలన్న ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం విధానంలో భాగంగా, ఈ నెల 11న విశ్వవిద్యాల యంగా ఆవిర్భవించింది. Continue Reading »

‘అవును! రాజమౌళిని పట్టుకుని చంపారు’

‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటా’ అని హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉర్దూ లో ఒక సామెత ఉండేది. దొంగతనంచేసిన వాడే పోలీసధికారిని నిందించాడు అని అర్థం. దొంగే ముందు దొంగ దొంగ అని అరిచా డని తెలుగులో చెప్పుకొనేదానికన్నా ఆసక్తిదాయకమైన సామెత ఇది. కానీ ఇవ్వాళ్టి సందర్భంలో ‘పోలీసే ప్రజాస్వామిక హక్కు అడిగిన వాణ్ణి నేరస్తుడన్నాడని’, ‘హంతకుడే హత్య అన్నవాడిపై నేరారోపణ చేశాడ’ని చెప్పుకోవచ్చు. Continue Reading »

కాల్చి చంపుతున్న కాంగ్రెస్‌ను ప్రజలు కూలుస్తారు

రాజమౌళి అంత్యక్రియల్లో వరవరరావు ధ్వజం

Varavara Raoపెద్దపల్లి, న్యూస్‌టుడే: ప్రజల కోసం అజ్ఞాతంలో ఉంటున్న మావోయిస్టులను ప్రభుత్వం దొంగచాటుగా పట్టుకొచ్చి కాలుస్తోందని విరసం నేత పెండ్యాల వరవరరావు ఆరోపించారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా ఓదెల మండలం గూడెంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సందె రాజమౌళి అలియాస్‌ ప్రసాద్‌ అంత్యక్రియలకు వరవరరావు హాజరయ్యారు. ప్రజలకు సేవలు అందించలేని ప్రభుత్వం మావోయిస్టు పెద్ద తలలకు వెల కడుతోందన్నారు. Continue Reading »

రాజమౌళికి లాల్‌ సలామ్‌

(ఆన్‌లైన్‌-పెద్దపల్లి/ఓదెల) ఎర్రజెండా ఎర్రజెండా ఎన్నియల్లో… అంటూ 26 ఏళ్ల క్రితం గూడెం గ్రామంలో దొరకు వ్యతిరేకంగా కూలీలతో ర్యాలీ చేసిన ప్రసాద్‌ అలియాస్‌ సందె రాజమౌళి కోసం ఆదివారం జనం అదే ఎర్రజెండా పాటఆటతో ఘనంగా నివాళులర్పించారు. కరీం నగర్‌ జిల్లా ఓదెల మండలం, గూడెం గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామవీ«థుల గుండా ప్రసాద్‌ మృతదేహాన్ని ఊరేగించి దహనసంస్కారాలను నిర్వహించారు. Continue Reading »

పాలపిట్టల పాటలు

పాలపిట్టల పాటల గురించి

పరిచయం: పెండ్యాల వరవరరావు, ముందుమాట : అల్లం నారాయణ

రేలా రే…రేలా రే…

రచన: వరవరరావు
గానం: సంధ్య
Continue Reading »