శ్రీశ్రీతో ఎన్ని అనుభవాలో.. ఎన్ని జ్ఞాపకాలో..!
‘నేను అతన్ని కూడా బాగా ఎరుగుదును. నా అభిప్రాయం ఏమిటంటే-’ అని శ్రీశ్రీ గురించి రాయబోతే చలం హెచ్చరిక వెక్కిరిస్తుంది. అయినా శ్రీశ్రీతో పరిచయం అయి, ఆయన కూడా పదిమందిలో కలిసినప్పుడో, ఉత్తరాల్లోనో పలకరించేంత పరిచయం పెరిగినాక, కలిసి పనిచేసే అవకాశం వచ్చినాక ఆయన గురించి అభిప్రాయం లేదా జ్ఞాపకాలు చెప్పకుండా ఉండడం అసాధ్యమనుకుంటాను.