బాలగోపాల్ ప్రజాజీవిత ప్రారంభం – వరంగల్లు (1979-95)
వరంగల్ బాలగోపాల్‌ను తీర్చిదిద్దిందా, బాలగోపాల్ వరంగల్‌ను కంటికి రెప్పలా చూసుకున్నాడా. ఇపుడయితే కాశ్మీర్, మణిపూర్, ఛత్తీస్‌ఘర్ మొదలు దేశమే ఆయన తమను ఆదుకోవడానికి ప్రాణాలు పణంగా పెట్టాడని ఆక్రోశిస్తున్నాయి. ఊరు అనంతపురం. పుట్టింది బళ్లారి. ఇంటర్‌మీడియెట్ ఎం.జె. మాణిక్యరావు గణితశాస్త్ర విద్యార్థిగా కావలి. డిగ్రీ ఎస్.వి. యూనివర్సిటీ, తిరుపతి. ఇవన్నీ తండ్రి ఎల్.ఐ.సి. డెవలప్‌మెంట్ అధికారిగా ఏ ఊరు పోతే ఆ ఊరువాడు కావడం వల్ల.