నిన్న వినాయక్, నేడు అసిత్
అంతర్జాతీయ స్థాయిలో ఎంత ప్రచారం, ఉద్యమం సాగితే రెండేళ్ల తరువాత డాక్టర్ వినాయక్ సేన్‌కు బెయిలు వచ్చిందో చూశాం. ఈ నేపథ్యంలో అసిత్‌కు బెయిలు రావడమైనా, విడుదలకావడమైనా విస్తృత ప్రచారాన్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తే తప్ప సాధ్యమయ్యే పనులు కాదు. దేశవ్యాప్తంగా రాజకీయ ఖైదీలందరి విషయంలోనూ ఇది కఠోరమైన వాస్తవం. గుంటూరులో ఆగస్టు 12న విరసం నిర్వహించిన శ్రీశ్రీ శతజయంతి సభలో మిత్రుడు ఉపేంద్ర ‘అసిత్‌కుమార్ సేన్‌గుప్తాను, ఇతర రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి’ అనే [...]
కామ్రేడ్ అసిత్‌కుమార్ సేన్ గుప్తా నిర్బంధం – రాజకీయ ఖైదీల విడుదల ఉద్యమం
గుంటూరులో ఆగస్ట్ 12న విరసం గుంటూరు యూనిట్ నిర్వహించిన శ్రీశ్రీ శతజయంతి సభలో మిత్రుడు ఉపేంద్ర ‘అసిత్ కుమార్ సేన్ గుప్తాను, ఇతర రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి’ అనే విజ్ఞప్తి పత్రాన్ని నా చేతికిచ్చాడు. అది ఇంగ్లిష్‌లో ఉంది. ఆశ్చర్యమూ, అపరాధ భావమూ నా వంతు అయ్యాయి. దాదాపు ఇరవై నెలల క్రితం అసిత్ కుమార్ రాయపూర్‌లో అరెస్టయ్యాడని తెలుసు.
అసహజ మరణాలు
సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాయపూర్ సహారా టివి స్టూడియో నుంచి ఫోన్ వచ్చింది. ‘ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మిస్సింగట. మీ స్పందన కావాలి’ అని. నేనప్పుడు టివి లేనిచోట ఉన్నాను. ‘నాకేమీ తెలియదు. నేనున్న చోట టివిలేదు. కనుక నేనేం చెప్పలేన’న్నాను. ‘నల్లమలలో జరిగిందట. అందుకని అడుగుతున్నాను’ అన్నాడు.