అభివృద్ధి నమూనాపైనే చర్చ!
గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాల్లో పదహారు లక్షలమంది ప్రజలు నిర్వాసితులయ్యారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులవల్ల నిర్వాసితులైనవాళ్లలో ఎనభై శాతం మంది ఆదివాసులే ఉన్నారు. ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ సముద్ర తీరం వెంబడి అటవీ ప్రాంతాల్లో, మధ్య భారతంలోని అటవీ ప్రాంతంలో ఎనభై ప్రత్యేక ఆర్థిక మండలాలు రానున్నాయి.