December 2008
Monthly Archive
Monthly Archive
![]()
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలనే డిమాండుతో ప్రజా గాయకుడు గద్దర్ వరంగల్, హనుమకొండ, కాజీపేటలలో డిసెంబర్ 11 నుంచి 15 వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో ఆ మూడు పట్టణాల్లో ప్రతి గడప తొక్కి ప్రతి ఇంటిలో పౌరుల కడుపులో తలపెట్టి తన ఈ డిమాండుకు సంఘీభావం ప్రకటించాలని కోరారు. ఈ విషయాన్ని పాదయాత్ర ప్రారంభించడానికి ముందుగానే రాజధాని నగరంలో, వరంగల్‌లో, పలుచోట్ల చెప్పాడు. మీడియాలో విస్తృత ప్రచారాన్ని పొందింది. గద్దర్ వరంగల్ నగరంలో కాలు మోపితే చంపేస్తామని, ఆయన పాదం మోపే నేలకింద మందుపాతరలు పెట్టి పేల్చివేస్తామని బ్లూ టైగర్స్ పేరుతో ఒక మీడియా ప్రకటన వచ్చింది.
0 comments Tuesday 16 Dec 2008 | వరవరరావు | వ్యాసాలు, తెలుగు, AndhraJyothy
- వరవరరావు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో ప్రజా గాయకుడు గద్దర్ వరంగల్, హనుమకొండ, కాజీపేటలలో 2008, డిసెంబర్ 11 నుంచి 15 వరకు పాదయాత్ర తలపెట్టాడు. ఈ పాదయాత్రలో ఆ మూడు పట్టణాల్లో ఆయన ప్రతి గడప తొక్కి ప్రతి ఇంటిలో పౌరుల కడుపులో తలపెట్టి తన ఈ డిమాండుకు సంఘీభావం ప్రకటించాలని కోరుతానన్నాడు.
0 comments Thursday 11 Dec 2008 | వరవరరావు | వ్యాసాలు, తెలుగు
![]()
లోక్‌సభలో 1990 సెప్టెంబర్ 6న మండల్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు ప్రధాని వి.పి.సింగ్ ఇచ్చిన సమాధానంలోని కొన్ని భాగాలివి.
అణగారిన లేదా వెనుకబడిన కులాల్లో పుట్టిన ఒక వ్యక్తి జీవిత పర్యంతం అనేక అవమానాలను ఎదుర్కోవలసివుంది. చితిపై ఒక వ్యక్తి ఒక్కసారే కాలిపోతాడు; అయితే అణగారిన కులాల్లో పుట్టిన వ్యక్తులు తమ జీవితాంతం అడుగడుగునా అవమానాల పాలవుతారు. Continue Reading »
0 comments Monday 01 Dec 2008 | వరవరరావు | తెలుగు, AndhraJyothy
నిరసనలను, బయట ప్రదర్శనలను ఉత్సవాల్లో పాల్గొన్న కొందరు వక్తలు తప్పు పట్టినట్లుగా, అసహనం ప్రదర్శించి నట్లుగా చదివినప్పుడు, ఆ వక్తలు విప్లవ సాహిత్యాభిమానులు అని కూడ తెలిసినపుడు కాలం ఎంత మారింది అనిపించింది.
ఇప్పుడున్న భాషా సాహిత్య వాతావరణంలో 1970, 80ల తొలి రోజులను తలచుకుందాం. 1963-65 మధ్యకాలంలో ‘నవత’ వంటి ఉత్తమ కవిత్వ పత్రిక నిర్వహించిన ‘నక్షత్ర సప్తకం’ 70 జూలై 3,4 తేదీల్లో హైదరాబాదులో ‘అభ్యుదయ సాహిత్య వేదిక’ పేరుతో రెండు రోజుల సదస్సు నిర్వహించి ఆహ్వానిస్తే దిగంబర కవులు, తిరుగబడు కవులు, కె.వి.రమణారెడ్డి నిరాకరించారు. ‘అభ్యుదయ సాహిత్య వేదిక’ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మొదట మొహమాటపడిన శ్రీశ్రీ హైదరాబాదు దాకా వచ్చి అందులో పాల్గొనలేదు.
Continue Reading »
0 comments Monday 01 Dec 2008 | వరవరరావు | తెలుగు, AndhraJyothy