రాజమౌళికి లాల్ సలామ్
(ఆన్‌లైన్-పెద్దపల్లి/ఓదెల) ఎర్రజెండా ఎర్రజెండా ఎన్నియల్లో… అంటూ 26 ఏళ్ల క్రితం గూడెం గ్రామంలో దొరకు వ్యతిరేకంగా కూలీలతో ర్యాలీ చేసిన ప్రసాద్ అలియాస్ సందె రాజమౌళి కోసం ఆదివారం జనం అదే ఎర్రజెండా పాటఆటతో ఘనంగా నివాళులర్పించారు. కరీం నగర్ జిల్లా ఓదెల మండలం, గూడెం గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామవీ«థుల గుండా ప్రసాద్ మృతదేహాన్ని ఊరేగించి దహనసంస్కారాలను నిర్వహించారు. ప్రసాద్ చితికి ఆయన తండ్రి రాజయ్య రాత్రి నిప్పంటించారు. మావోయిస్టు పార్టీ కర్ణాటక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ శుక్రవారం రాత్రి అనంతపురంజిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో మరణించిన ప్రసాద్ మృతదేహాన్ని కడసారి చూడ డానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు.
దొంగచాటు పోస్టుమార్టమెందుకు..?: వరవరరావు
పెద్దపల్లి: మానవహక్కుల కమిషన్ సిఫారసు మేరకు ఎన్‌కౌంటర్లపై ఫోరెన్సిక్ వైద్యుల బృందం సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని నిబంధన లున్నప్పటికీ,దొంగచాటుగా పోస్టుమార్టమ్‌లు నిర్వ హిస్తున్నారని ప్రసాద్ అంత్యక్రియలకు హాజరైన విప్లవకవి వరవరరావు విమర్శించారు. మావోయిస్టు పార్టీ కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ అలియాస్ రాజమౌళిని యలహంకిలో అరెస్టు చేసి పథకం ప్రకారం రైల్వేస్టేషన్లో కాల్చిచంపిన పోలీసులు నిజ మైన ఎన్‌కౌంటర్‌గా ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
మావోయిస్టు పార్టీ బల హీనపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తూనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం దేశంలో విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతూ వందలాది మందిని బూటకపు ఎన్‌కౌంటర్లో హతమార్చుతున్న దని అమరవీరుల బంధుమిత్రుల కమిటీ ప్రతినిధి గంటి ప్రసాదం ఆరోపించారు. ప్రసాద్ అంత్యక్రియ ల్లో పాల్గొనలేకపోయినందుకు తనను క్షమించా ల్సిందిగా ప్రజాకవి గద్దర్ ప్రజలను కోరారు. ఆది వారం అంత్యక్రియలకు గద్దర్ వస్తున్నారని వేలాది మంది ఎదురుచూడగా ఆయన విలేకరులతో ఫోన్ లో మాట్లాడుతూ అనారోగ్య పరిస్థితి కారణంగానే గూడెంకు రాలేకపోయానని తనను క్షమించి ప్రసా ద్ అంత్యక్రియల్లో పాల్గొనాల్సిందిగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Monday 25 Jun 2007 | వరవరరావు | తెలుగు, NewsPaper Archive, AndhraJyothy
వరవరరావు గారు నమస్కారము సారు. మీ పొరతస్పూర్థి మాకు ఉత్తెజము ఇస్థుంది……………