‘నేను చెప్పలేదా, నాకు ఆడపిల్ల పుట్టింది. ఇంక మీరు నన్ను అరెస్టు చేసుకోవచ్చు’ అన్నాడు. ‘తల్లీ, పిల్లను దవాఖానానుంచి తీసుకొస్తారు కదా. ఇంటికి వస్తాం లెండి’ అన్నారు పోలీసులు. చెరబండరాజును అక్టోబరు 11న మీసా కింద అరెస్టు చేశారు. అంటే ఉదయిని అప్పటికి మూడు రోజులపాప.

1973 అక్టోబర్ 6,7 తేదీల్లో వరంగల్‌లో విరసం ‘సాహిత్య పాఠశాల’ జరిగింది. విరసం మహాసభలకు బదులుగా ‘సాహిత్య పాఠశాల’ నిర్వహించే సంప్రదాయం అట్లా ప్రారంభమైంది. శ్రీశ్రీ ‘మినీలాంగ్ మార్చ్’గా నిర్వచించిన ఊరేగింపు హనుమకొండ జీవన్‌లాల్ గ్రౌండ్స్‌నుంచి వరంగల్ మహబూబియా హైస్కూల్ గ్రౌండ్స్ (జగదీశ్‌నగర్) వరకు ఎనిమిది కిలోమీటర్లు సాగింది. Continue Reading »