May 2007
Monthly Archive
Monthly Archive
సోహ్రాబుద్దీన్ షేక్, కౌసర్‌బీ (గుజరాత్ పోలీసులచే ఎన్‌కౌంటర్ హత్యకు గురయిన భార్యాభర్తలు)ల ఉదంతం అనివార్యంగా ఒక ప్రశ్నకు తావిస్తుంది: ‘మన రాష్ట్రంలో అటువంటి బూటకపు ఎన్‌కౌంటర్‌లో పాత్ర ఉన్నప్పటికీ కనీసం ఎస్.ఐ. స్థాయి పోలీసు అధికారి అయినా ఎన్నడైనా నేరారోపణ నెదుర్కొన్నాడా?’ (ప్రస్తావిత గుజరాత్ ఎన్‌కౌంటర్ ముగ్గురు ఐపిఎస్ అధికారుల - ఇద్దరు గుజరాత్, మరొకరు రాజస్థాన్ కేడర్‌కు చెందిన వారు- సస్పెన్షన్, అరెస్ట్‌కు దారితీసింది). సొహ్రబుద్దీన్, కౌసర్‌బీల ఎన్‌కౌంటర్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులకూ ప్రమేయం ఉందని వార్తలు వెలువడ్డాయి. ఇక్కడి పోలీసధికారులు తక్షణమే ఆ వార్తలను ఖండించడమే కాక పరువు నష్టం దావా దాఖలు చేస్తామన్నంత దూరం పోయారు. Continue Reading »
0 comments Friday 11 May 2007 | వరవరరావు | వ్యాసాలు
‘నేను చెప్పలేదా, నాకు ఆడపిల్ల పుట్టింది. ఇంక మీరు నన్ను అరెస్టు చేసుకోవచ్చు’ అన్నాడు. ‘తల్లీ, పిల్లను దవాఖానానుంచి తీసుకొస్తారు కదా. ఇంటికి వస్తాం లెండి’ అన్నారు పోలీసులు. చెరబండరాజును అక్టోబరు 11న మీసా కింద అరెస్టు చేశారు. అంటే ఉదయిని అప్పటికి మూడు రోజులపాప.
1973 అక్టోబర్ 6,7 తేదీల్లో వరంగల్‌లో విరసం ‘సాహిత్య పాఠశాల’ జరిగింది. విరసం మహాసభలకు బదులుగా ‘సాహిత్య పాఠశాల’ నిర్వహించే సంప్రదాయం అట్లా ప్రారంభమైంది. శ్రీశ్రీ ‘మినీలాంగ్ మార్చ్’గా నిర్వచించిన ఊరేగింపు హనుమకొండ జీవన్‌లాల్ గ్రౌండ్స్‌నుంచి వరంగల్ మహబూబియా హైస్కూల్ గ్రౌండ్స్ (జగదీశ్‌నగర్) వరకు ఎనిమిది కిలోమీటర్లు సాగింది. Continue Reading »
0 comments Thursday 10 May 2007 | వరవరరావు | వ్యాసాలు
శ్రీరమణ రచన ఎక్కడ దొరికినా చదవడం నాకిష్టం. ఆయన చాల సీరియస్ విషయాలను చాల సరదాగా రాస్తారు. అలవోకగా చెప్తారు. శ్రీకాలమ్‌లో ఆయన వైఎస్ఆర్‌ను చురకలు పెడుతూ రాసినా, చంద్రబాబును హాస్యం చేసినా వాళ్లకెట్లా ఉంటుందో గానీ నాకు సరదాగానే ఉండేది. పత్రికలవాళ్లు అధికారంలో ఉన్న పవర్‌ఫుల్ వ్యక్తులను కొంచెం నొప్పిస్తూ రాసినా ఆమాత్రం గిల్లడం అవసరమే. ఆ లెక్కన ఇవ్వాళ పవర్ రుచి చూసి రేపు ఇంకా పవర్‌ఫుల్ కావడానికి అవకాశం వున్న కెసిఆర్ నరేంద్రలను శ్రీ రమణ ఎద్దేవా చేయడం కూడా సరదాగానే ఉంటుంది. కాని ఎందుకో ఈసారి (8వ తేదీనాటి ‘శ్రీకాలమ్’లో) ఆయన కెసిఆర్‌ను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ కోరుకొంటున్న వారిని వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తున్నది. ఈ క్రమంలో ఆయన కొన్ని అసంబద్ధమైన సిద్ధాంతాలు, సూత్రీకరణలు కూడా చేశారు. సరదారచనల్లో సాధారణంగా సీరియస్ సూత్రీకరణలు ఉండవు. అసలు ఎందుకో సూత్రీకరణలతో ప్రారంభించి సీరియస్‌గానే వెక్కిరించారు శ్రీరమణ. Continue Reading »
3 comments Wednesday 09 May 2007 | వరవరరావు | వ్యాసాలు