స్థానికత-సార్వజనీనత

స్థానికత-సార్వజనీనత  - వరవరరావుతిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు కరీంనగర్‌ విశ్వవిద్యాలయం శ్రీరాజరాజేశ్వరీ విశ్వ విద్యాలయం ఎందుకుకాకూడదు? సమ్మక్క సారలక్క విశ్వవిద్యాలయం ఎందుకు కాకూడదు?

కరీంనగర్‌లో 1985 నుంచి శాతవాహన స్నాతకోత్తర కళాశాలగా పనిచేస్తున్న ఉన్నత విద్యా సంస్థ, జిల్లాకో విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలన్న ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం విధానంలో భాగంగా, ఈ నెల 11న విశ్వవిద్యాల యంగా ఆవిర్భవించింది. Continue Reading »

‘అవును! రాజమౌళిని పట్టుకుని చంపారు’

‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటా’ అని హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉర్దూ లో ఒక సామెత ఉండేది. దొంగతనంచేసిన వాడే పోలీసధికారిని నిందించాడు అని అర్థం. దొంగే ముందు దొంగ దొంగ అని అరిచా డని తెలుగులో చెప్పుకొనేదానికన్నా ఆసక్తిదాయకమైన సామెత ఇది. కానీ ఇవ్వాళ్టి సందర్భంలో ‘పోలీసే ప్రజాస్వామిక హక్కు అడిగిన వాణ్ణి నేరస్తుడన్నాడని’, ‘హంతకుడే హత్య అన్నవాడిపై నేరారోపణ చేశాడ’ని చెప్పుకోవచ్చు. Continue Reading »

కాల్చి చంపుతున్న కాంగ్రెస్‌ను ప్రజలు కూలుస్తారు

రాజమౌళి అంత్యక్రియల్లో వరవరరావు ధ్వజం

Varavara Raoపెద్దపల్లి, న్యూస్‌టుడే: ప్రజల కోసం అజ్ఞాతంలో ఉంటున్న మావోయిస్టులను ప్రభుత్వం దొంగచాటుగా పట్టుకొచ్చి కాలుస్తోందని విరసం నేత పెండ్యాల వరవరరావు ఆరోపించారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా ఓదెల మండలం గూడెంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సందె రాజమౌళి అలియాస్‌ ప్రసాద్‌ అంత్యక్రియలకు వరవరరావు హాజరయ్యారు. ప్రజలకు సేవలు అందించలేని ప్రభుత్వం మావోయిస్టు పెద్ద తలలకు వెల కడుతోందన్నారు. Continue Reading »

రాజమౌళికి లాల్‌ సలామ్‌

(ఆన్‌లైన్‌-పెద్దపల్లి/ఓదెల) ఎర్రజెండా ఎర్రజెండా ఎన్నియల్లో… అంటూ 26 ఏళ్ల క్రితం గూడెం గ్రామంలో దొరకు వ్యతిరేకంగా కూలీలతో ర్యాలీ చేసిన ప్రసాద్‌ అలియాస్‌ సందె రాజమౌళి కోసం ఆదివారం జనం అదే ఎర్రజెండా పాటఆటతో ఘనంగా నివాళులర్పించారు. కరీం నగర్‌ జిల్లా ఓదెల మండలం, గూడెం గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామవీ«థుల గుండా ప్రసాద్‌ మృతదేహాన్ని ఊరేగించి దహనసంస్కారాలను నిర్వహించారు. Continue Reading »

పాలపిట్టల పాటలు

పాలపిట్టల పాటల గురించి

పరిచయం: పెండ్యాల వరవరరావు, ముందుమాట : అల్లం నారాయణ

రేలా రే…రేలా రే…

రచన: వరవరరావు
గానం: సంధ్య
Continue Reading »

గుజరాత్‌ సరే, ఇక్కడి ‘ ఎన్‌కౌంటర్ల’ మాటేమిటి?

సోహ్రాబుద్దీన్‌ షేక్‌, కౌసర్‌బీ (గుజరాత్‌ పోలీసులచే ఎన్‌కౌంటర్‌ హత్యకు గురయిన భార్యాభర్తలు)ల ఉదంతం అనివార్యంగా ఒక ప్రశ్నకు తావిస్తుంది: ‘మన రాష్ట్రంలో అటువంటి బూటకపు ఎన్‌కౌంటర్‌లో పాత్ర ఉన్నప్పటికీ కనీసం ఎస్‌.ఐ. స్థాయి పోలీసు అధికారి అయినా ఎన్నడైనా నేరారోపణ నెదుర్కొన్నాడా?’ (ప్రస్తావిత గుజరాత్‌ ఎన్‌కౌంటర్‌ ముగ్గురు ఐపిఎస్‌ అధికారుల - ఇద్దరు గుజరాత్‌, మరొకరు రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన వారు- సస్పెన్షన్‌, అరెస్ట్‌కు దారితీసింది). సొహ్రబుద్దీన్‌, కౌసర్‌బీల ఎన్‌కౌంటర్‌ లో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకూ ప్రమేయం ఉందని వార్తలు వెలువడ్డాయి. ఇక్కడి పోలీసధికారులు తక్షణమే ఆ వార్తలను ఖండించడమే కాక పరువు నష్టం దావా దాఖలు చేస్తామన్నంత దూరం పోయారు. Continue Reading »

కేన్సర్ వ్యవస్థలో ఛిద్రమైన కవి కుటుంబం

‘నేను చెప్పలేదా, నాకు ఆడపిల్ల పుట్టింది. ఇంక మీరు నన్ను అరెస్టు చేసుకోవచ్చు’ అన్నాడు. ‘తల్లీ, పిల్లను దవాఖానానుంచి తీసుకొస్తారు కదా. ఇంటికి వస్తాం లెండి’ అన్నారు పోలీసులు. చెరబండరాజును అక్టోబరు 11న మీసా కింద అరెస్టు చేశారు. అంటే ఉదయిని అప్పటికి మూడు రోజులపాప.

1973 అక్టోబర్ 6,7 తేదీల్లో వరంగల్‌లో విరసం ‘సాహిత్య పాఠశాల’ జరిగింది. విరసం మహాసభలకు బదులుగా ‘సాహిత్య పాఠశాల’ నిర్వహించే సంప్రదాయం అట్లా ప్రారంభమైంది. శ్రీశ్రీ ‘మినీలాంగ్ మార్చ్’గా నిర్వచించిన ఊరేగింపు హనుమకొండ జీవన్‌లాల్ గ్రౌండ్స్‌నుంచి వరంగల్ మహబూబియా హైస్కూల్ గ్రౌండ్స్ (జగదీశ్‌నగర్) వరకు ఎనిమిది కిలోమీటర్లు సాగింది. Continue Reading »

బతుకుదెరువుకూ దోపిడీకీ తేడా లేదా?

శ్రీరమణ రచన ఎక్కడ దొరికినా చదవడం నాకిష్టం. ఆయన చాల సీరియస్ విషయాలను చాల సరదాగా రాస్తారు. అలవోకగా చెప్తారు. శ్రీకాలమ్‌లో ఆయన వైఎస్ఆర్‌ను చురకలు పెడుతూ రాసినా, చంద్రబాబును హాస్యం చేసినా వాళ్లకెట్లా ఉంటుందో గానీ నాకు సరదాగానే ఉండేది. పత్రికలవాళ్లు అధికారంలో ఉన్న పవర్‌ఫుల్ వ్యక్తులను కొంచెం నొప్పిస్తూ రాసినా ఆమాత్రం గిల్లడం అవసరమే. ఆ లెక్కన ఇవ్వాళ పవర్ రుచి చూసి రేపు ఇంకా పవర్‌ఫుల్ కావడానికి అవకాశం వున్న కెసిఆర్ నరేంద్రలను శ్రీ రమణ ఎద్దేవా చేయడం కూడా సరదాగానే ఉంటుంది. కాని ఎందుకో ఈసారి (8వ తేదీనాటి ‘శ్రీకాలమ్’లో) ఆయన కెసిఆర్‌ను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ కోరుకొంటున్న వారిని వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తున్నది. ఈ క్రమంలో ఆయన కొన్ని అసంబద్ధమైన సిద్ధాంతాలు, సూత్రీకరణలు కూడా చేశారు. సరదారచనల్లో సాధారణంగా సీరియస్ సూత్రీకరణలు ఉండవు. అసలు ఎందుకో సూత్రీకరణలతో ప్రారంభించి సీరియస్‌గానే వెక్కిరించారు శ్రీరమణ. Continue Reading »